కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్

72చూసినవారు
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆలయ సన్నిధానానికి చేరుకున్న ఆయనను వేదపండితులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.పవన్ కళ్యాణ్ అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా.. తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పవన్ తిరుగుపయనమయ్యారు.

సంబంధిత పోస్ట్