ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు మరో బిగ్ షాక్ తగిలింది. గత సంవత్సరాల్లో ఈక్విటీ షేర్ల కేటాయింపునకు సంబంధించిన స్టాంప్ డ్యూటీలను చెల్లించడంలో విఫలమైనందుకు రూ.47.12 లక్షల జరిమానా పడింది. గత సంవత్సరాల్లో 10,26,386 ఈక్విటీ షేర్లకు సంబంధించి మొత్తం రూ.1.43 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించలేదు. దీంతో పేటీఎంకు రూ.47.12 లక్షల జరిమానా పడింది. ఈ మేరకు పేటీఎం తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.