తుపాకితో నెమళ్ల వేట.. పోలీసుల అదుపులో వేటగాడు

590చూసినవారు
తుపాకితో నెమళ్ల వేట.. పోలీసుల అదుపులో వేటగాడు
జాతీయ పక్షులైన నెమళ్లను వేటాడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని ఐతుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి లైసెన్స్డ్‌ గన్ తో నెమళ్లను వేటాడి అక్కడి నుంచి తరలిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్