కీ.శే తోకల పెద్ద పోచయ్య- రాజమ్మ కుటుంబ సభ్యులు వారి తల్లి-తండ్రి జ్ఞాపకార్థంగా మంథని మండలం బెస్తపల్లిలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొదటి విజేత తోకల పెద్ద సతీష్- అరిపెళ్లి సుశాంత్, రెండవ విజేత గుమ్ముల రాజశేఖర్- ధర్మాజి రమేష్ లకు గ్రామస్థుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఇందులో గ్రామస్తులు బోరె లింగయ్య, తోకల చిన్న నర్సయ్య, ధర్మాజి పెద్ద నగేష్,మేడి నరేష్, మేడి రాయనర్సు, మేడి గంగా రాజు,మేడి కుమార్,బోరె రాజేశం,ధర్మాజి మధునయ్య తదితరులు పాల్గొన్నారు. ఇందులో పొందిన నగదు బహుమతిని విజేతలు స్పోర్ట్స్ అవసరాలకు యువతకి అందచేయటం సంతోషకరమని వారి పెద్ద కుమారుడు తోకల పెద్ద సతీష్ హర్షం వ్యక్తం చేశారు.