పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసే చర్యలను విరమించుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ధర్నా మరియు రాస్తా రోకో నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం, బిజెపి అగ్రనాయకులు కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కయ్యారని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇనుముల సతీష్ ఆరోపించారు. రైతులను ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య, ఓదెల జడ్పిటిసి సభ్యులు గంట రాములు యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుమ్మడి కుమార స్వామి, పెర్క శ్యామ్, జిల్లా కార్యదర్శి పబ్బతి రాధా రెడ్డి, గౌసియా, పెద్దపల్లి, రామగుండం కాంగ్రెస్ నాయకులతో పాటు మంథని నియోజకవర్గ నాయకులు తోట చంద్రన్న, మంథని సత్యం, అయిలి శ్రీనివాస్, చంద్రు రాజమల్లు, నాంపల్లి సతీష్, కొప్పుల భూమయ్య తదితరులు పాల్గొన్నారు.