జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా, గోదావరిఖని టూ టౌన్ పోలీసులు యైటింక్లైన్ కాలనీ షిర్కే బస్టాండ్ వద్ద వాహనదారులకు, యువకులకు, వ్యాపారస్తులకు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ "ట్రాఫిక్ రూల్స్ పాటించటం చాలా ముఖ్యమని మరియు రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉంది అని తెలిపారు.