పెద్దపల్లి: విద్యతోనే పేదరికం నుంచి శాశ్వత విముక్తి
విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని అదనపు కలెక్టర్ వేణు అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ ఆయన పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలు చదువుకోవాలనే ఆశయంతో కులమత బేధాలు లేకుండా పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.