కలుషిత నీరు సరఫరా పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సోమవారం
కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి అనంతరం సింగరేణి జిఎంకు వినతి పత్రం అందచేశారు
కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం. ఎస్ రాజ్ ఠాకూర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోదావరిఖని ప్రాంతంలో సింగరేణి కార్మిక కాలనీలో మంచినీటిని సరఫరా చేసే నీటిని త్రాగి విరోచనాలతో పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నరాని అన్నారు. యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లిన కూడా పట్టించుకోలేదని దీంతో హాస్పిటల్ పాలవుతున్నారని అన్నారు.