డబుల్ రోడ్డు నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయాలి

82చూసినవారు
డబుల్ రోడ్డు నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయాలి
పాలకుర్తి మండలం బసంతనగర్ తెలుగు మీడియం స్కూల్ నుండి ఈసాల తక్కల్లపల్లి గ్రామం శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు సిసి రోడ్డు పనులు ప్రారంభించి అర్థాంతరంగా పనులను నిలిపివేయడం పట్ల శుక్రవారం పాలకుర్తి మండల బీఆర్ఎస్ ప్రతినిధి ముల్కాల కొమురయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హడావుడిగా కొబ్బరికాయలు కొట్టి రోడ్డు ప్రారంభోత్సవం చేసి 10రోజుల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పి నమ్మించి ప్రజలను మోసం చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్