ఇజ్రాయెల్ ప్రధాని హత్యకు ఇరాన్ కుట్ర!
ఇజ్రాయెల్‌లోని కీలక నాయకులు, అధికారుల హత్యకు ఇరాన్ కుట్ర పన్నినట్లు అంతర్గత భద్రతా సంస్థ షిన్‌బెట్ వెల్లడించింది. హిట్‌లిస్ట్‌లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి గాలెంట్, షిన్బిట్ చీఫ్ రోనెన్ బార్ ఉన్నట్లు ప్రకటించింది. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని.. ఈ కుట్రల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో తెలుసుకుంటున్నామని షిన్‌బెట్ తెలిపింది.