జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశుల వారు వజ్రాన్ని అస్సలు ధరించకూడదని పండితులు పేర్కొంటున్నారు. మిథున రాశి వారు వజ్రాన్ని ధరించకూడదు. అలాగే, జాతకంలో కుజుడు, గురుడు, శుక్ర గ్రహాలున్న వారు వజ్రం ధరిస్తే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఎవరి జాతకంలోనైనా శుక్రుడు తృతీయ, పంచమ, అష్టమ స్థానాల్లో ఉంటే వారు వజ్రం ధరించడం శ్రేయస్కరం కాదంటున్నారు. రక్త సంబంధిత వ్యాది లేదా షుగర్ తో బాధ పడే వారు వజ్రం ధరించొద్దు.