విద్యార్థినులకు ‘పీరియడ్’ సెలవులు.. ఎక్కడంటే?

574చూసినవారు
విద్యార్థినులకు ‘పీరియడ్’ సెలవులు.. ఎక్కడంటే?
చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ కీలక ప్రకటన చేసింది. ఇకపై విద్యార్థినులకు పీరియడ్ సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఒక సెమిస్టర్‌కు గరిష్ఠంగా 4 లీవ్‌లు తీసుకునేందుకు అనుమతిస్తామని పేర్కొంది. అయితే సెమిస్టర్, ఇంటర్నల్, ప్రాక్టికల్ పరీక్షల సమయంలో సెలవులు ఉండవని వెల్లడించింది. కాగా కేరళలోని కొచ్చిన్ వర్సిటీ, నల్సార్(హైదరాబాద్), గువాహటి వర్సిటీ, తేజ్‌పూర్ వర్సిటీ విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించాయి.

సంబంధిత పోస్ట్