ఢిల్లీలో రైతుల సభకు అనుమతి

60చూసినవారు
ఢిల్లీలో రైతుల సభకు అనుమతి
రాజధాని నగరంలోని రామ్‌లీలా మైదానంలో గురువారం తాము నిర్వహించతలపెట్టిన ‘కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌’కు ఢిల్లీ పోలీసులు అనుమతించినట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) మంగళవారం వెల్లడించింది. ప్రశాంతంగా నిర్వహించనున్న ఈ సభలో మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉద్ధృతం చేసేందుకు తీర్మానం చేయనున్నట్లు తెలిపింది. కట్టుదిట్టమైన షరతులతో రైతుల సభకు అనుమతి ఇచ్చినట్లు ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్