తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక సంచలన తీర్పు ఇచ్చారు. ఓ కేసులో హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు రూ.కోటి జరిమానా విధించారు. అక్రమ మార్గాల్లో ప్రభుత్వ భూములను సొంతం చేసుకోవాలనే యత్నాలను హైకోర్టు అడ్డుకుంది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని దాచి వేరే బెంచ్ వద్దకు పిటిషనర్లు వెళ్లారు. పిటిషన్ పెండింగ్‌లో ఉండగా.. ఇంకో బెంచ్‌లో వాస్తవాలు దాచి ఆర్డర్ తీసుకోవటంపై సీరియస్ అయ్యారు.