అదుపు తప్పిన పికప్ ట్రక్కు.. షాకింగ్ వీడియో

562చూసినవారు
వర్షాలు పడుతున్నప్పుడు వాహనాల డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా లేకుంటే ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇదే కోవలో తమిళనాడులోని దిండిగల్ ప్రాంతంలో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఓ పికప్ ట్రక్కు డ్రైవర్ వేగంగా దూసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో అతడి వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్‌లు, స్కూటర్లను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్