శాంతి, స్వేచ్ఛకు ప్రతీకగా పావురాలను ఎగురువేసి పంద్రాగస్టు సహా పలు అధికారిక వేడుకలను ప్రారంభించటం భారత్‌లో ఆనవాయితీ. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేళిలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఓ పావురం ఎగరని ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. దీంతో ఎగరలేని అనారోగ్యంతో ఉన్న పావురాన్ని తీసుకొచ్చిన బాధ్యులపై క్రమశిక్షణా చర్యలకు డిమాండ్ చేస్తూ ఎస్పీ గిరిజా శంకర్ జైస్వాల్ కలెక్టర్ రాహుల్ దేవ్‌కు లేఖ రాశారు.