ఆసుపత్రిలో పోలీసులను దారుణంగా కొట్టారు (వీడియో)

68చూసినవారు
బీహార్‌లోని అర్రా జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. సదర్ ఆసుపత్రిలో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులను కొట్టారు. డయల్ 112 పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో ఏదో విషయంలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ మహ్మద్, సబ్బీర్ రాజా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు తమతో పాటు ఐదుగురు భద్రతా సిబ్బందిని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్