ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ గెలవగానే దేశవిదేశాల్లో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్‌లో రోడ్లపైకి వచ్చిన ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్‌లోనూ ఇవే తరహా దృశ్యాలు కనిపించాయి. టీమిండియా గెలుపును సెలబ్రేట్ చేసుకునేందుకు కరీంనగర్‌లో రాత్రి వేళ భారీగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.