వర్షాలు కురుస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాల పడుతున్నప్పుడు అవసరమైతే తప్పా బయటికి రావద్దు. నడిచేటప్పుడు మ్యాన్ హోల్స్, విద్యుత్ స్థంభాలను చూసుకొని నడవాలి. చెట్ల కింద నిలబడొద్దు. పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది. విద్యుత్ సమస్యలుంటే అధికారులకు చెప్పాలి కానీ స్వతహాగా రిపేర్ చేయవద్దు. ఎర్త్‌లు, షాక్స్ తగిలి చనిపోయే ప్రమాదం ఉంటుంది. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దు.