రబీ కాలంలో వరి మాగాణి భూముల్లో మినుము పైరుపై 35 నుంచి 40 రోజుల దశలో కొరినోస్పొరా ఆకుమచ్చ తెగులు సోకే అవకాశం ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్ (లేదా) 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ (లేదా) 2.0 మి.లీ. హెక్సాకోనజోల్‌ను 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు మందులు మార్చి పిచికారీ చేయాలి. యల్.బి.జి.648 రకం ఈ తెగులును తట్టుకొంటుంది.