పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెబుతోంది?

76చూసినవారు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెబుతోంది?
రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను నియంత్రించే లక్ష్యంతో 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి 10వ షెడ్యూల్‌ను చేర్చి, దానిలో ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని’ వివరించింది. ఈ చట్టం ప్రధాన ఉద్దేశం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించి, బలోపేతం చేయడం. ‘ప్రజా జీవన ప్రక్షాళనలో ఇది మొదటి అడుగు’ అని రాజీవ్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఆర్టికల్స్‌ 101, 102 190, 191ల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్