కాలిఫోర్నియాలో భారీ భూకంపం

79చూసినవారు
కాలిఫోర్నియాలో భారీ భూకంపం
కాలిఫోర్నియాలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 4.1గా నమోదైంది. మొత్తం కెర్న్ కౌంటీని బలమైన భూకంపం తాకింది. చురా, మారికాపో, శాంటా బార్బరా ప్రాంతాల్లో భూమి కంపించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం కాలిఫోర్నియాలోని లామోన్‌కు నైరుతి దిశలో 24 కి.మీ దూరంలో ఉంది. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్