వాతావరణ పరిస్థితుల కారణంగా కూరగాయల పంటల్లో చీడపీడల ఉధృతి పెరిగింది. ఇవి ఆశించిన తోటల్లో పెరుగుదల తగ్గుతుంది. దిగుబడులు వచ్చినా నాణ్యత కోల్పోతాయి. రసం పీల్చే పురుగులు నివారణకు డైమిథోయేట్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కొమ్మ, కాయతొలుచు పురుగు నివారణకు ప్రోఫెనోఫాస్ 2 మిలీ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. లద్దె పురుగు నివారణకు నోవాల్యూరాన్ 1.25 మి. లీ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.