టిక్కెట్టు లేని ఓ మహిళ భద్రతా సిబ్బంది కళ్లుకప్పి విమానమెక్కి, బాత్రూమ్‌లో కూర్చుని జర్నీ చేసిన ఉదంతం అమెరికాలో వెలుగులోకి వచ్చింది. దొంగచాటుగా అమెరికా నుంచి ఫ్రాన్స్‌కు చేరుకున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని అమెరికాకు తిరిగి పంపించారు. నిందితురాలిని రష్యాకు చెందిన స్వెత్లానా డాలీగా (57) గుర్తించారు. నవంబర్ 26న డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ డీఎల్264 లోకి ఆ మహిళ దొంగచాటుగా ప్రవేశించింది.