నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. BGT 2వ డే/నైట్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీం ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి ఓవరులో జైస్వాల్, 18వ ఓవరులో రాహుల్, 21వ ఓవరులో కోహ్లీ(7) స్టార్క్ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యి నిరాశపరిచారు. వికెట్లు పడుతున్నా పరుగుల వరద పారించిన గిల్(31) కూడా ఔట్ అయ్యాడు. స్టార్క్ 3, బోలాండ్ ఓ వికెట్ తీశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 82/4గా ఉంది. క్రీజులో రోహిత్, పంత్ ఉన్నారు.