అబద్దాలు చెప్పడంలో ప్రధాని దిట్ట: సీఎం

77చూసినవారు
అబద్దాలు చెప్పడంలో ప్రధాని దిట్ట: సీఎం
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర స్థాయలో విరుచుకుపడ్డారు. అబద్ధాలు, ప్రజల మనోభావాలను మంటగలపడం ఆయన అలవాటుగా మారిందని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో మోదీ గొప్ప వ్యక్తి అని ఎద్దేవా చేశారు. మోదీ చేసిన రిజర్వేషన్, మంగళసూత్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిందని, వాటిపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రధాని అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్