మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు వెల్లడించారు.