యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ)కు చెందిన ప్రాజెక్ట్ ఫర్ ఆన్ బోర్డ్ అటానమీ(ప్రోబ్)–3 మిషన్ను ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ ద్వారా విజయవంతంగా ప్రయోగించింది. కృత్రిమ సూర్య గ్రహణాన్ని సృష్టించడం ద్వారా సంపూర్ణ సూర్యగ్రహణాలను, కరోనా ఉపరితలాన్ని అధ్యయనం చేయడమే ఈ మిషన్ లక్ష్యం. దీన్ని ఇన్ ఆర్బిట్ డెమొన్స్ట్రేషన్ మిషన్ అంటారు.