పట్టణాలు, నగరాల్లోని భూముల సర్వే నంబర్లు, ఇళ్లను 'నక్ష' కార్యక్రమం ద్వారా అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం పౌరులందరికీ ఆధార్ ఇస్తున్నట్టుగానే.. ప్రతీ గృహ యజమానికి ప్రాపర్టీ కార్డును విశిష్ట గుర్తింపు సంఖ్యతో ఇవ్వనున్నారు. ఈ కార్డుపై 'క్యూఆర్' కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే పూర్తి వివరాలు లభిస్తాయి.