భద్రాచలం-ఏటూరునాగారం 4 వరసల హైవేకు ప్రతిపాదనలు: తుమ్మల

55చూసినవారు
భద్రాచలం-ఏటూరునాగారం 4 వరసల హైవేకు ప్రతిపాదనలు: తుమ్మల
భద్రాచలం - ఏటూరునాగారం 4 వరసల హైవేకు ప్రతిపాదనలు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. జగ్గయ్యపేట నుంచి వైరా, తల్లాడ మీదుగా కొత్తగూడెం వరకు 4 వరసల హైవేకు ప్రతిపాదనలు పంపిచామన్నారు. విజయవాడ-జగదల్‌పూర్‌ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాల మీదుగా హైవే వెళ్తున్నందున బైపాస్‌రోడ్డు నిర్మించాలని కోరామని చెప్పారు. ఖమ్మం చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు చేశామని.. గత ప్రభుత్వం విస్మరించిందన్నారు.

సంబంధిత పోస్ట్