AP: చెన్నై ఐఐటీలో నిర్వహించిన 'ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025' కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడారు. 'ఎక్కడికెళ్ళినా మన తెలుగు వారే ఉన్నారు. ఐ యాం ప్రౌడ్ టు బి యాన్ ఇండియన్.. అలాగే తెలుగు వాడిగా గర్వపడుతున్నా.1995లో IT మాట్లాడా.. 2025లో AI మాట్లాడుతున్నా. ఆ రోజు హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టా. ఇప్పుడు క్వాంటం వ్యాలీ డెవలప్ చేస్తున్నామని పేర్కొన్నారు.