మయన్మార్‌ను శుక్రవారం వరుసగా రెండు బలమైన భూకంపాలు కుదిపేశాయి. భూకంపం ధాటికి భవనాలు పేకమేడల్లా కూలిపోవడంతో 25 మంది మృతి చెందినట్లు సమాచారం. అటు బ్యాంకాక్‌లో ఓ స్కై బిల్డింగ్ కుప్పకూలడంతో శిథిలాల కింద దాదాపు 43 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ కార్మికుడు శిథిలాల కింద చిక్కుకుని కాపాడండి అని వేడుకుంటున్నాడు. ఇది చూసిన నెటిజన్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.