బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సౌత్ ఇండియా సినీ ప్రేక్షకుల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఇండియా ప్రేక్షకులకు మాపై ప్రేమ ఉంటుందని, కానీ మా సినిమాలు థియేటర్‌కు వెళ్లి చూడరని అన్నారు. అందుకే బాలీవుడ్ సినిమాలు సౌత్ ఇండియాలో ఆడట్లేదని తెలిపారు. కానీ సికిందర్ మూవీతో ఆ వెలితి తీరుతుందని పేర్కొన్నారు. కాగా సల్మాన్ ఖాన్, రష్మికా మందన్న కలిసి నటించిన మూవీ సికిందర్. రంజాన్ సందర్భంగా ఈ మూవీ విడుదల కానుంది.