ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప-2: ది రూల్' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నార్త్ ఇండియాలో బుకింగ్స్ ఉదయమే స్టార్ట్ అవ్వగా.. తెలంగాణకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌ను శనివారం సాయంత్రం 4.56 గంటలకు ప్రారంభించారు. ప్రస్తుతం, పేటియం, బుక్ మై షోలతో పాటు, జోమాటోకి చెందిన 'డిస్ట్రీక్ట్' యాప్‌లో 'పుష్ప-2' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.