విజయ్ దేవరకొండపై పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు

1533చూసినవారు
విజయ్ దేవరకొండపై పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు
రౌడీ బాయ్ విజయ్‌ దేవరకొండ సినిమాలపై భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు మాట్లాడింది. విజయ్‌ నటించిన సినిమాల్లో కొన్ని తనకు నచ్చలేదని చెప్పింది. అలాగే హీరో ప్రభాస్‌ అంటే తనకు క్రష్‌ అని తెలిపింది. అతని సినిమాలన్నీ చూశానని.. డైరెక్ట్ గా కలిసే అవకాశం మాత్రం రాలేదని చెప్పింది. ఒత్తిడి తగ్గించుకోవడానికి మూవీస్ చూస్తానని చెప్పుకొచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్