ముగిసిన సార్వత్రిక సమరం.. ఏడో దశ పోలింగ్ పూర్తి

72చూసినవారు
ముగిసిన సార్వత్రిక సమరం.. ఏడో దశ పోలింగ్ పూర్తి
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. 44 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన ఓటింగ్‌ ప్రక్రియలో దేశ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏప్రిల్‌ 19నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు ఏడు దశల్లో ఎన్నికల సంఘం సుదీర్ఘంగా పోలింగ్‌ను నిర్వహించింది. చెదురుముదురు హింసాత్మక ఘటనల నడుమ శనివారం ఏడో దశ పోలింగ్‌ కూడా జరిగింది. ప్రధాని మోదీ సహా దిగ్గజ నేతలు బరిలో నిలిచిన స్థానాల్లో ఏడోదశలో ఓటింగ్‌ పూర్తయింది.

సంబంధిత పోస్ట్