ముంబై ఇన్నింగ్స్‌లో 25వ ఓవర్‌ను జమ్మూకశ్మీర్ బౌలర్ ఉమర్ నజీర్ వేశాడు. రహానె షార్ట్ పిచ్ బంతిని ఆడే క్రమంలో బంతి బ్యాట్‌ను తాకుతూ వికెట్ కీపర్ చేతుల్లో పడింది. అంపైర్ ఔట్ ఇచ్చాడు. రహానె కూడా పెవిలియన్ బాట పట్టాడు. అయితే, బౌలర్ క్రీజ్ బయటకు వచ్చి బంతిని విసిరినట్లు థర్డ్ అంపైర్ చెప్పాడు. అప్పటికే మరొక బ్యాటర్ కూడా మైదానంలోకి వచ్చాడు. అతడిని వెనక్కి పంపించిన రహానె బ్యాటింగ్‌ను కొనసాగించాడు.