మహారాష్ట్రలోని పూణేలో తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. నావలే వంతెనపై ఆగి ఉన్న బస్సును స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మరణించారు. కారు ముందు భాగం కూడా పూర్తిగా ధ్వంసం అయింది. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆరుగురు యువకులు పుట్టినరోజు పార్టీ నుంచి తిరిగి వస్తుండగా, ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.