కడప జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రొద్దుటూరులో భగత్‌సింగ్ నగర్‌లోని బ్యాగుల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపుచేస్తున్నారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.