రాహుల్ గాంధీ హెలికాప్టర్ చెకింగ్ (వీడియో)

85చూసినవారు
లోక్‌సభ ఎన్నికల వేళ అధికారుల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. తమిళనాడులోని నీలగిరిలో ఈ తనిఖీలు నిర్వహించారు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యాక ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. నీలగిరి లోక్ సభ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థి ఎ.రాజాకు మద్దతుగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్