కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ నిర్వహించాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా వైద్యుల సూచన మేరకు ఈ ప్రచార సభ రద్దైందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవేందర్ తెలిపారు. శుక్రవారం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించే అవకాశం ఉంది.