ముంబైలోని బోరివాలి రైల్వేస్టేషన్‌లో ఓ మహిళా ప్రయాణికురాలు క్షణంలో ప్రాణాలతో బయటపడింది. మహిళా ప్రయాణికురాలు కదులుతున్న రైలు నుంచి దిగే ప్రయత్నంలో పట్టుతప్పి ప్లాట్‌ఫామ్‌పై పడిపోయింది. మహిళ పడుతుండగా గమనించిన రైల్వే కానిస్టేబుల్ పరుగున వెళ్లి ఆమెను పక్కకు లాగేశాడు. దాంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.