రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు

2541చూసినవారు
రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత తగ్గి పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేటి ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. రాజస్థాన్‌ మీదుగా నైరుతి రుతుపవనాలు తుఫానుగా మారి కోస్తా కర్ణాటక వరకు వ్యాపించాయని తెలిపింది. మరో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

సంబంధిత పోస్ట్