ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా మంగళవారం LSGతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించడంతో పాటు అర్ధ శతకం అందుకున్నారు. దీంతో PBKS జట్టు సభ్యులు ఆనందంతో ఎగిరి గంతేశారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 4 పాయింట్స్, 1.485 రన్ రేట్ సాధించి IPL పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి చేరుకుంది.