
ఆంక్షలకు పూర్తి విరుద్ధంగా జగన్ పర్యటన: పల్నాడు ఎస్పీ
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చామని.. కానీ, ఆంక్షలకు పూర్తి విరుద్ధంగా కార్యక్రమం జరిగిందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. "పోలీసులపై ప్రజాప్రతినిధులు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా తలెత్తాయి. ప్రజాప్రతినిధులు సైతం వారి అనుచరులతో తిరిగారు. వైసీపీ ఉల్లంఘనలపై న్యాయ సలహాలతో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం." అనిఎస్పీ వెల్లడించారు.