ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ తన భార్యతో కలిసి ఫోర్బ్స్ మ్యాగజైన్ కు అదిరిపోయే స్టిల్ ఇచ్చారు. తాజాగా ఫోర్బ్స్
ఇండియా మ్యాగజైన్ తన కవర్ పేజీ పై ఈ దంపతుల ఫొటోను ముద్రించింది. పింక్ కలర్ అవుట్ ఫిట్స్ లో
ఉపాసన సోఫాలో కూర్చోగా.. రామ్ చరణ్ ఆమె కాళ్ల దగ్గర కూర్చున్న ఫొటోను మ్యాగజైన్ కవర్ పేజీగా వేసింది. ఈ ఫొటో పక్కన ‘సూపర్ కపుల్. వారిద్దరూ కాలేజీ స్వీట్ హార్ట్స్’ అంటూ క్యాప్షన్ పెట్టింది.