మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని సినిమా

82చూసినవారు
మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని సినిమా
హీరో రామ్ పోతినేని పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ రీమేక్ డబల్ ఇస్మార్ట్ తో రాబోతున్నాడు. ఇటీవల అన్నీ మాస్ సినిమాలు చేస్తున్న రామ్ పోతినేని మళ్ళీ ఓ క్లాస్ సినిమా చేయాలనుంటున్నాడు. ’మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ చిత్ర దర్శకుడు మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా రామ్ తో చేయబోతున్నట్టు టాలీవుడ్ లో వినిపిస్తుంది. రామ్ కథ ఓకే చేసినట్టు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్