ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. భారీగా వరద నీరు జనావాసాల్లోకి వచ్చింది. ఇక వరద నీటికి నదుల ఒడ్డున ఉన్న ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు వరదల కారణంగా 14 మంది చనిపోయారు. 9 లక్షలకు పైగా ప్రజలు వరద ముంపునకు గురయ్యారు. వరదలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడానికి రెస్క్యూ టీమ్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక స్థానిక విమానాశ్రయాలలో డజన్ల కొద్దీ విమానాలు రద్దు అయ్యాయి.