బీజేపీ చేస్తున్న పోరాటాలను గుర్తించి ప్రజలు ఆదరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. BJP బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందిన నేపథ్యంలో బండి సంజయ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రామరాజ్యం, మోదీ రాజ్యం రానుందని చెప్పేందుకు ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. 317 జీవోకు వ్యతిరేకంగా భాజపా చేసిన పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించారన్నారు.