AP: ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు బడ్జెట్ సమావేశాల మొదటి రోజు వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీలో నిరసన తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌కు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ RRR ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించారు. ఇందులో బాగంగా విపక్ష హోదా పొందే అవకాశం లేకున్నా జగన్‌కు ప్రతిపక్ష బెంచిలో ముందు వరుసలో సీటు ఇచ్చారు. విపక్ష హోదా కోసం పోరాడుతున్న జగన్‌కు ఇది శుభవార్త అనే చెప్పొచ్చు.